Homebreaking updates newsMega Family: మెగా ఫ్యామిలీలోకి మరో బుజ్జాయి.. తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్ దంపతులు

Mega Family: మెగా ఫ్యామిలీలోకి మరో బుజ్జాయి.. తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్ దంపతులు

భారత్ సమాచార్.నెట్: మెగా ఫ్యామిలీ (Mega Family) నుంచి మరో శుభవార్త వచ్చింది. మెగా ఫ్యామిలీలోకి మరో బుజ్జి పాపాయి రాబోతున్నట్లు వరుణ్ తేజ్ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya tripati) దంపతులు ప్రకటించారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠి గర్భవతి అంటూ వస్తున్న వార్తలకు ఈ ప్రకటనతో తెరపడింది.

తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో చిన్నారి షూస్‌తో పాటు వరుణ్, లావణ్య ఒకరి చేతిని ఒక్కరు పట్టుకున్న ఫొటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇలా రాసుకొచ్చారు.. ”జీవితంలో ఇప్పటివరకు అత్యంత అందమైన పాత్ర.. త్వరలో రాబోతుంది” అంటూ తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు, సెలెబ్రెటీలు వరుణ్ దంపతులకు శుభాకంక్షాలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఏడాదిన్నర తర్వాత మొదటి బిడ్డను ఆహ్వానిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో నవంబర్ 1న ఇటలీలో వివాహం చేసుకున్నారు. క్లింకార తర్వాత మెగా ఫ్యామిలీలోకి మరో బుజ్జి పాప రానుండడంతో మెగా కుటుంబం అంతా సంతోషంలో ఉన్నారు. కాగా ప్రెగ్నెంట్ కావడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండనుంది లావణ్య.
RELATED ARTICLES

Most Popular

Recent Comments