భారత్ సమాచార్.నెట్: భారత్ ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సెప్టెంబర్ 9న ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటించనుంది ఎన్నికల సంఘం.
కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్ట్ 21 నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీగా పేర్కొనగా.. ఆగస్ట్ 22న నామినేషన్ పత్రాలను పరిశీలిన జరగనుంది. నామినేషన్ చేసే అభ్యర్థులు ఆగస్ట్ 25 వరకు నామినేషన్లు ఉపసంహించుకోవచ్చు సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఇక ఈ లోపే ఎన్డీఏ, ఇండియా కూటములు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఇకపోతే జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామాతో ఉప రాష్ట్రపతి స్థానం ఖాళీ అయింది. అనారోగ్య కారణాలతో వైద్యుల సూచన మేరకు జగదీప్ ధన్కర్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 74 ఏళ్ల ధన్కర్ 2022లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం 2027లో ముగియాల్సి ఉండంగా.. రెండు ఏళ్ల ముందే రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.