August 2, 2025 7:56 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Vice President Poll: ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సెప్టంబరు 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

 

అయితే ఆగస్ట్ 7న ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థుల నుంచి ఆగస్ట్ 21 నుంచి నామినేషన్లను స్వీకరించానున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 25వ తేదీగా నిర్ణయించారు. సెప్టెంబర్ 9 ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. కాగా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తోంది ఈసీ.

 

మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజ్ జాబితాను ఖరారు చేసింది ఈసీ. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ ఎలక్టోరల్ కాలేజ్‌లో పార్లమెంట్ సభ్యులు ఉంటారని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అధికారిక ప్రకటన చేసింది. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 66 (1) ప్రకారం.. ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఆర్టికల్‌ 324 కింద ఎన్నికలు నిర్వహిస్తారు.

Share This Post