HomeUncategorizedపేద విద్యార్థుల కోసం విద్యాదాన్ స్కాలర్ షిప్‌

పేద విద్యార్థుల కోసం విద్యాదాన్ స్కాలర్ షిప్‌

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా: ఎల్ఐసీ (Life Insurance corporation of india ) వారి సహకారంతో సరోజినీ దామోదర ఫౌండేషన్ నుండి ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహహించుటకు అందించేదే ఈ విద్యాదాన్ స్కాలర్ షిప్‌. వీళ్ళు లేటెస్ట్ గా SSC లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ని అందిస్తున్నారు.

ఇప్పటి వరకు విద్యాదాన్ స్కాలర్ షిప్‌ పొందిన వాళ్ళు ఎవరు? 

దేశ వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, చెన్నై, ఒడిశా, గోవా, ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు 8000 మందికి పైగా ఈ విద్యాదాన్ స్కాలర్ షిప్‌ ద్వారా ఆర్ధిక సాయం పొందారు. అదే విధంగా ఈ 2024-25 విద్య సంవత్సరానికి కూడా కొత్త అప్లికేషన్స్ ని అహ్వానిస్తున్నారు.

విద్యాదాన్ స్కాలర్ షిప్‌కి ఎంత డబ్బులు ఇస్తారు?
ఈ సంవత్సరం సహాయం – 10 వతరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులు,ఇంటర్మీడియట్ లేదా సమానమైన కోర్సులలో చదువుటకు మొదట సంవత్సరం 10 వేల రూపాయలు, రెండవ సంవత్సరం కి మరో 10 వేల రూపాయలు ని అందిస్తారు.ఇదే కాకుండా ఆయా రాష్ట్రాలలో వున్న ఆ ఫీజు ఆధారంగా గరిష్టంగా 75,000 వరకు కూడా ఆర్ధిక సాయం చేస్తారు.

విద్యాదాన్ స్కాలర్ షిప్‌‌కి అర్హత ఎంటీ?
విద్యార్థుల కుటుంభ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల లోపు వున్నవారికి మాత్రమే
ఈ 2023-24 లో SSC పూర్తి చేసి ఇంటర్/డిప్లమా చదువుతున్న వారు అర్హులు.
విద్యార్ధికి కనీసం 90% మార్కులు లేదా 9 CGPA సాధించిన వాళ్ళు అర్హులు.
దివ్యంగులకు మాత్రం కనీసం 75% మార్కులు లేదా 7.5 CGPA సాధించిన వాళ్ళు అర్హులు.

ముఖ్యమైన తేదీలు
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి
దరఖాస్తుకు ఆఖరి తేదీ – 07/06/2024
Online పరీక్ష తేదీ – 23/06/2024
ఇంటర్వ్యూ తేదీ – జులై 7 నుండి జులై 20 మధ్యలో ఉంటుంది.

తెలంగాణ కి సంబంధించి
దరఖాస్తుకు ఆఖరి తేదీ – 15/06/2024
Online పరీక్ష తేదీ – 07/07/2024
ఇంటర్వ్యూ తేదీ – ఆగస్టు 01 నుండి ఆగష్టు 10 వ తేదీ మధ్యలో ఉంటుంది

ఎంపిక విధానము ఇలా ఉంటుంది

విద్యార్థి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాక అతని యొక్క మార్కులు,కుటుంభం ఆదాయాలు,మిగిలిన వివరాలు కూడా చెక్ చేసుకుని మెయిల్ కి ఒక సమాచారం పంపిస్తారు. పైన తెలిపిన తేదీలలో Onlineలో పరీక్ష నిర్వహించి, ఆ తరువాత మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) కూడా నిర్వహించడం జరుగుతుంది.

కావలసిన డాకుమెంట్స్ ఏమిటి?
దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థి ఈ క్రింది డాక్యుమెంట్స్ ని తప్పనిసరిగా Upload చేయవలెను.
10 వతరగతి మార్క్ షీట్ (ఒరిజినల్ అందుబాటులో లేకపోతే Official Website నుండి Professional Mark sheet ని అయినా అప్లోడ్ చేయవచ్చును.)
పాసుపోర్టు సైజ్ ఫోటో
2024 లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate)
విద్యార్థి దివ్యంగులు అయితే ధ్రువీకరణ పత్రం

ఆన్ లైన లో దరఖాస్తు చేయు విధానము?
ఈ Vidyadhan Scholarship కొరకు రెండు విధాలుగా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మొదట స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆఫిషియల్ వెబ్సైటు లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఒక password ని కూడా 8 అక్షరాలతో create చేసుకోవాలి.మరియు ఆ పాస్వర్డ్ అనేది మీ ఇమెయిల్ కి పెట్టింది కాకూడదు. దీనికి కొత్తదిగా పెట్టుకోవాలి. అంతేగానీ ఇంటర్నెట్ షాప్ వాళ్ళది,లేదా మరే ఇతర షాప్ ల వాళ్ళ ఇమెయిల్ Id ఇవ్వకూడదు.
స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లో మీరు పెట్టు కున్న పాస్వర్డ్ ని మాత్రం మర్చిపోకూడదు.ఎందుకంటే ఈ వెబ్సైటులో లాగిన్ అయిన ప్రతిసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

సంప్రదించాల్సిన వివరాలు?
ఆంధ్రప్రదేశ్ కి చెందిన విధ్యార్దుల కొరకు Help Desk
Email – vidyadhan.andhra@sdfoundationindia.com
Mobile Number – 9663517131 (పని దినాలలో సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలి)

తెలంగాణ కి చెందిన విధ్యార్దుల కొరకు Help Desk
Email – vidyadhan.telangana@sdfoundationindia.com
Mobile Number – 9663517131 (పని దినాలలో సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలి)

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి

ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

RELATED ARTICLES

Most Popular

Recent Comments