Homemain slidesరౌడీ బాయ్ బర్త్ డే నేడు

రౌడీ బాయ్ బర్త్ డే నేడు

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

వెండితెరపై హీరోగా కనిపించాలన్న కూడా చాలా అంశాలు కలిసి రావాలి. నటన, డాన్స్ లో మెరిట్ ఉండాలి. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొవాలి. చాలా ఓపిక ఉండాలి. సరైన అవకాశాలు రావాలి. వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవాలి. వీటన్నింటితో పాటుగా కొంచెం అదృష్టం కూడా కలసి రావాలి. సరైన సమయంలో ఇలాంటి మిరాకల్స్ అన్ని జరిగితేనే హీరో అవుతారు. దీనికి తోడు స్టార్ డమ్ కూడా రావాలంటే అంతకు మించిన అద్భుతం జరగాలి. ఇలాంటి అద్భుతాలు అన్ని కూడా లక్షల్లో ఒకరికి, ఏ పుష్కర కాలానికో ఒకరికి ఇలా జరుగుతాయి. లైఫ్ లో ఇలాంటి ఫీట్స్ అన్ని దాటి వచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో రౌడీ బాయ్ గా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ బాయ్ 1989 మే 9వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తుమ్మన్ పేట్ గ్రామంలో జన్మించాడు.

ఫ్యామిలీ స్టార్, రౌడీ బాయ్, ది విజయ్ దేవరకొండ ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా, ఈ పేర్లు రావటానికి అసలు కారణం మాత్రం ‘అర్జున్ రెడ్డి’నే. ఈ ఒక్క సినిమాతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. సినీ పరిశ్రమలో దశాబ్ద కాలంలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి హిట్ దొరుకుతుంది. ప్రాంతీయంగా తెలుగులో రిలీజ్ అయిన ‘అర్జున్ రెడ్డి’తోనే పాన్ ఇండియా లెవల్లో హీరోగా గుర్తింపు పొందాడు విజయ్. అందరు విజయ్ మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ అని అనుకుంటారు. కానీ అంతుకు ముందు రవి బాబు దర్శకత్వంలో ‘నువ్విలా’మూవీలో నటించాడు. ఇదే నటుడిగా అతడికి మొదటి సినిమా. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిపుల్’లో కూడా చిన్న నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెరిశాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటనకు గాను నంది ప్రత్యేక జ్యూరీ అవార్డును పొందాడు. ఇక ‘అర్జున్ రెడ్డి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ‘గీతా గోవిదం’తో ఆ సక్సస్ ను కంటిన్యూ చేశాడు. తాజా గా ఇదే కాంబినేషన్ లో ‘ఫ్యామిలీ స్టార్’గా సినీ ప్రేమికుల ముందుకు వచ్చి మెప్పించాడు. త్వరలోనే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ టాక్.

మరికొన్ని సినీ సంగతులు…

ఫీల్ మై లవ్…

RELATED ARTICLES

Most Popular

Recent Comments