భారత్ సమాచార్.నెట్: సూర్య హీరోగా (Actor Surya) నటించిన రెట్రో (RETRO) ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-release event)లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన (Controversy) సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ స్పందించారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు తన దృష్టికి వచ్చిందని.. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదన్నారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపారు.
ఈ వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇస్తూ.. ఏ వర్గాన్ని, ఏ తెగనూ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగలను బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదన్నారు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. దేశంలోని ప్రజలంతా ఒక్కటేనని తాను భావిస్తానని తెలిపారు. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని.. ఐక్యంగా ఉండాలన్నారు. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపలేదన్నారు. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నాను. ట్రైబల్ అనే పదాన్ని వేరే సెన్స్‌లో యూజ్ చేసానని పేర్కొన్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వెళ్లిన విజయ్ అక్కడ వేదికపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడబోయి గిరిజనులు అంటూ కీలక కామెంట్స్ చేశాడు. 500 ఏళ్ల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను తలపించేలా పహల్గామ్ ఉగ్రదాడి ఉందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్ వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై విజయ్ స్పందించారు. మరీ ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్ పడుతుందో లేదో చూడాలి.
Vijay Deverakonda: వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ
Related Posts:
Related posts:
Tirumala: శ్రీవారి ఆలయంలో రేపటి నుండి పవిత్రోత్సవాలు
Revanth Govt: మెగా కోడలికి.. రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు
PM Modi: శిబు సోరెన్‌కు నివాళులు.. హేమంత్ సోరెన్‌ను ఓదార్చిన ప్రధాని మోదీ
“సనాతన భావాలను ఎదుర్కునేది విద్య ద్వారానే”..!
Supreme Court: రాహుల్ గాంధీకి సుప్రీం చీవాట్లు
కనీసం నెలరోజులు కాలేదు అప్పుడే కుంగిన రోడ్డు
భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని..
|Today Horoscope నేటి రాశిఫలాలు
ధర్మన్నగూడలో ఘనంగా బోనాల వేడుకలు
బీజేపీకి మద్ధతుగా నిలవాలి: శాంతికుమార్
MLC కవితకు జగదీష్ రెడ్డి కౌంటర్
ఆయన ఒక లిల్లీపుట్ నాయకుడు: ఎమ్మెల్సీ కవిత