July 28, 2025 12:13 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Vishwambhara: కేన్స్‌ వేదికపై ‘విశ్వంభర’ బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే?  

భారత్ సమాచార్.నెట్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirranjeevi) ప్రధాన పాత్రలో, వశిష్ట (Vassishta) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ త్వరలో రానుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (Cannes Film Festival) ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా, టీజర్‌కి బదులుగా ‘విశ్వంభర బుక్’ (Vishwambhara Book) ను విడుదల చేశారు మేకర్స్.
విశ్వంభర పుస్తకాన్ని నిర్మాత విక్రమ్ కేన్స్ వేదికగా ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నిర్మాణ సంస్థ ఈ విషయంపై స్పందిస్తూ.. విశ్వంభర మీ ముందుకు ఓ అద్భుతమైన ప్రపంచాన్ని తీసుకొస్తోంది. ఈ బుక్‌లో అసలు ఏముంది అనేది తెలుసుకోవాలంటే ఇంకొంత సమయం వేచిచూడాల్సిందే అంటూ పేర్కొంది.
ఇదిలా ఉంటే ఈచిత్రాన్ని సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 13సెట్లు వేసి, ఒక కొత్త ప్రపంచాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చిరంజీవి కెరీర్‌లో ఇంత పెద్దస్థాయిలో బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు. అందుకే ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రాన్నికి సంబంధించి కేవలం చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదలయ్యాయి. అనంతరం రెండు పాటలను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Share This Post
error: Content is protected !!