భారత్ సమాచార్.నెట్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ మూవీని బింబిసార (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) తెరకెక్కిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామ రామ’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి (M.M Kiravani) బాణీలు సమకూర్చిగా.. రామజోగయ్యశాస్త్రి (Ramajogayya Sastry) లిరిక్స్ అందించారు. శంకర్ మహాదేవన్ (Shankar Mahadevan), లిప్సికా (Lipsika) ఈ గీతాన్ని ఆలపించారు. ఈ సాంగ్ శ్రవణభరితంగా, వినసొంపుగా ఉండటంతో పాటు, శ్రోతలను అలరించేలా ఉంది.
ఈ పాటలో శ్రీరాముడి గొప్పతనం వివరించారు. చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో ఈ పాటకు డ్యాన్స్ చేసిన విధానం, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే గ్రాఫిక్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను పలు కారణాల చేత జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా.. ఆషిక రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘విశ్వంభర’కు కీరవాణి సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించగా, ఇప్పుడు వచ్చిన ‘రామ రామ’ పాట ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.