Homebreaking updates newsపరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..సీఎం

పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..సీఎం

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాజాగా సీఎం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని సందర్శించారు. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని మరోసారి భరోసా ఇచ్చారు. కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ఫాక్స్‌కాన్ ముందుకు రావాలని కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ , స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

గ్యారెంటీల గారడీలు ఇక చెల్లవ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments