July 28, 2025 12:12 pm

Email : bharathsamachar123@gmail.com

BS

వారెవ్వా తలైవా..తగ్గేదేలే

భారత్ సమాచార్,సినీ టాక్స్ : తలైవా రజినీ.. ఈ రెండు పదాలు చాలు ఆయన ఫ్యాన్స్ ఉర్రూతలూగడానికి. తన స్టైలిష్ నటనతో భారతీయ సినిమా అగ్రనటుడిగా ఆయన ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. కమల్ హాసన్ లాంటి అందం, నటన.. చిరంజీవి లాగా డ్యాన్స్, ఫైట్స్, మమ్ముట్టి, మోహన్ లాల్ లాగా హవాభావాలు.. ఇవన్నీ ఆయనకు లేవు. పెద్దగా అందగాడూ కూడా కాదు. చిన్న కళ్లు, నల్లని ఛాయ, ఆకట్టుకోని రూపం.. ఈయన హీరోనా ? అని నాడు ప్రశ్నించిన వాళ్లే.. ఇప్పుడు లేచి చప్పట్లు కొడుతున్నారు. ఇండియాతో పాటు జపాన్, మలేసియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ భారీగా అభిమానులు తన స్టైల్ తో, వ్యక్తిగత ప్రవర్తనతో అశేశ అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో రజినీ.

రజినీకాంత్ సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఇష్టంతో మద్రాస్ చేరుకున్నారు. మొదట్లో అందరూ రజినీ నీకు హీరో వేషాలు ఎవరైనా ఇస్తారా? అని విమర్శించారు. మద్రాస్ లో దర్శకులు, నిర్మాతల వద్దకు వెళ్లి చాన్స్ ఇమ్మంటే బయటకు వెళ్లు.. అన్నవాళ్లు కూడా ఉన్నారు. చివరకు చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు వేశారు. ఆ తర్వాత బాలచందర్ లాంటి దిగ్గజ దర్శకుడు రజినీలోని స్పార్క్ ను చూసి అవకాశాలు ఇచ్చారు. వాటితో తనెంటో ప్రూఫ్ చేసుకున్నారు. ఆయన కెరీర్ కు బాగా ప్లస్ అయిన సినిమా భాషా.. ఈ సినిమాతో సౌత్ ఇండియాను మొత్తం షేక్ చేసేశాడు రజినీ. తర్వాత ముత్తు సినిమాతో అగ్నేయాసియా, జపాన్ వంటి దేశాలు ఆయన నటనకు ఫిదా అయ్యాయి. దళపతి, పెదరాయుడు, అరుణాచలం, చంద్రముఖి, రోబో, జైలర్..లాంటి చిత్రాలతో ఆయన కీర్తి ఆకాశన్నంటింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రజినీ బర్త్ డే నేడు. ఆయన సూపర్ స్టార్ అయినా ఒక సాధారణ వ్యక్తిగా మాత్రమే జీవిస్తారు. స్టైల్ కే స్టైల్ నేర్పిన ఘనత రజినీది.

మరికొన్ని సినీ కథనాలు…

‘గేమ్ చేంజర్’లో సాయిపల్లవి?

 

Share This Post
error: Content is protected !!