July 28, 2025 12:23 pm

Email : bharathsamachar123@gmail.com

BS

దళపతి తమిళనాడును ఏలగలడా?

భారత్ సమాచార్, జాతీయం : విజయ్ దళపతికి సీఎం అయ్యేంత సీన్ ఉంటుందా?

విజయ్ దళపతి.. తమిళనాట ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు..రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి స్టార్ డమ్ ఉన్న హీరో ఆయన. విజయ్ తల్లిదండ్రులిద్దరికీ సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నా.. సినిమా అవకాశాలు ఈజీగా రాలేదు. చిన్నప్పుడు చెల్లి విద్య అకాల మరణంతో తీవ్ర మనోవేధనకు గురైన విజయ్ మొదట డాక్టర్ అవుదామనుకున్నాడు. తండ్రి కూడా ఆ దిశగా ప్రోత్సహించాడు. కానీ విజయ్ తన దృష్టిని సినిమాల వైపు మళ్లించాడు.

ఈక్రమంలో విజయ్ ఇవాళ తన రాజకీయ ఆరంగ్రేటం చేశారు. తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను ప్రకటించారు. 2026లో తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతోందని విజయ్ వెల్లడించాడు. 49 ఏండ్ల విజయ్ రాజకీయాల్లో సత్తా చాటుతాడా? అనే అనుమానాలు బయలుదేరాయి.

ప్రస్తుత తమిళ రాజకీయాలను చూస్తే డీఎంకే పార్టీ తర్వాత బలమైన పార్టీ అక్కడ లేదు. అన్నా డీఎంకే ఉన్నా జయలలిత మరణంతో ఆ పార్టీ రాజకీయ నాయకత్వం లేక ఇబ్బందులు పడుతోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ లకు పెద్దగా ఆదరణ లేదు. ఈ తరుణంలో అక్కడ పేరున్న సినిమా నటుడు పార్టీ పెడితే కచ్చితంగా లాభించే అవకాశాలు ఉన్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు అద్భుతమైన భవిష్యత్ ఉండేది. కానీ వయోభారం వల్ల తాను రాజకీయాల్లోకి రాలేనని తన అభిమానులను నిరాశ పరిచారు. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ పార్టీ ఉన్నా..ఆయన పెద్దగా రాణించలేకపోతున్నారు. కానీ రజినీకాంత్ లాగా విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ కు ఇప్పుడా చాన్స్ వచ్చింది. తమిళ రాజకీయాల్లో ఉన్న శూన్యతను అతడు భర్తీ చేయవచ్చు. ప్రస్తుతం బలమైన డీఎంకే అధికారంలో ఉంది. మరో రెండేండ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో విజయ్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. డీఎంకేపై వ్యతిరేకత విజయ్ పార్టీకి అనుకూలంగా మారనుంది. ఒకవేళ ఈసారి కొద్దిలో తప్పినా ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లోనైనా విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. కాబట్టి విజయ్ మంచి సమయంలోనే పార్టీ పెట్టాడనే అభిప్రాయం వినపడుతోంది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

మన దేశ చట్టాల్లో ఐదు ఆసక్తికరమైన అంశాలు…

Share This Post
error: Content is protected !!