Homeతెలంగాణఅధికారం మారుతుందా.. హ్యాట్రిక్ కొడుతుందా..?

అధికారం మారుతుందా.. హ్యాట్రిక్ కొడుతుందా..?

భారత్ సమాచార్ ; తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ సమీకరణాలు చకచక మారిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈసారి అధికారం మాది అంటే మాది అని ఎవరి సొంత డబ్బావారు కొట్టుకుంటున్నారు. ఎవరికి వారు విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తుకుంటున్నారు. ఈసారి ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే హోరా హోరిగా ముక్కోణపు పోటీ ఉండబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటి నుంచే ఎవరి అస్త్రశస్త్రాలు వారు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే అగ్ర పార్టీ నాయకులు కొందరు ప్రజా సమస్యల ఎజెండాతో పాదయాత్రలు షురూ చేశారు. అధికార పార్టీపై కన్నెర్ర చేసి అమలకు నోచుకోని హామీలను, సగంలోనే ఆగిపోయిన అభివృద్ధి పనులను..కేసీఆర్ తొమ్మదేళ్ల పాలను.. అర్థం కాని ధరణిని..అవసరానికి మించిన అప్పులు అని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి ముక్కోణపు మ్యాచ్‌లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

కేసీఆర్ మోడల్ పని చేస్తుందా

దేశ రాజకీయాల్లో కేసీఆర్ రైతు రాజ్యం అనే ఎజెండాతో ముందుకు రానున్నారు. అప్పటి వరకు ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న మోదీ ఒక్కసారిగా గుజరాత్ మోడల్ పేరుతో పీఎం అయ్యారు. అదే విధంగా తెలంగాణలోని రైతు సంక్షేమాన్ని చూపిస్తూ పీఎం అవ్వాలనుకుంటున్నారు. మన రాష్ట్రంలో రైతులకు చేసిన సంక్షేమం బాగానే ఉంది. కానీ దానికి ఎన్నో విమర్శలు ఉన్నాయి. వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు సాయం, కౌలు రైతులను పట్టించుకోకపోవడం, ధరణి పేరుతో ఇబ్బందులు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలేడు.. అయినా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత సీఎంకు అవగతం కానట్టు ఉంది. రాష్ట్రంలో గెలిచారు.. కానీ ఎన్ని సీట్లు వచ్చాయి 2014లో 63 సీట్లను గెలుచుకుంది. ఆ తరువాత సకల పార్టీల సమ్మిళితంగా తెరాస ఆవిర్భవించింది. 2019లో ఎక్కువ సీట్లను గెలుచుకోవచ్చు కానీ.. (అది వేరే విషయం). అయినా తెలంగాణ రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలు సమూలంగా అభివృద్ధి చెందారు? అనే ప్రశ్నకు ఏ ఒక్క మంత్రి దగ్గర జవాబు లేదు. ఇంక ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త పథకం పెట్టి..ఊకదంపుడు ప్రసంగాలు చేసి..అమలు కాని హామీలు ఇచ్చి ఎలాగో అలా ఆ సీటుని అధికార పార్టీ హస్తగతం చేసుకుంటూ వస్తోంది.

కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి..చేతలు గడప దాటవు

తెలంగాణ మోడల్ అంటే ముందుగా నవ్వేది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతే. దిల్లీ మోడల్ అని కేజ్రీవాల్ అంటే దానికో అర్థం ఉంది. అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నారు. దీల్లీ ప్రజలపై ఒక్క రూపాయి కూడా అప్పులేకుండా మిగులు బడ్జెట్ను చూపించిన ఘనత కేజ్రీవాల్ది. కానీ తెలంగాణలో అప్పు లెక్కలు తీసి చూస్తే అంతే సంగతులు. మన రాష్ట్రంలో సక్రమంగా సాగింది, సాగుతుంది.. పోలీసు నియామకాలే. అంతకు మించి ఏ ప్రక్రియ సక్రమంగా సాగలేదు. అయినా వేరే ఉద్యోగాలు ఎక్కడ ప్రకటించారు? దేశంలో ఉద్యోగాల కోసం ఎక్కువగా వెతికేది హైదరాబాద్ నిరుద్యోగులేనని ఇన్డీడ్ సంస్థ ప్రకటించింది. డిగ్రీలు, పీజీలు చేసి బట్టల దుకాణాల్లో, పెట్రోల్ బంకుల్లో, హోటల్లలో తెలంగాణ యువత నానా కష్టాలు పడుతుంది. ఇందుకా తెలంగాణ సాధించుకున్నది అని దు:ఖిస్తుంది.

హ్యాట్రిక్ విజయం వరిస్తుందా

ఏది ఏమైనా కేసీఆర్ కి ఈసారి మాత్రం అభివృద్ధికి ఓట్లు వేసేవారి సంఖ్య కన్నా..పథకాల తాయిలాలను చూసి ఓట్లు వేసే వారికి సంఖ్యే ఎక్కువ ఉన్నట్లు ఓ బోగట్టా. ఒకవేళ గత ఎన్నికల కంటే ఈసారి సీట్లు తక్కువ వచ్చినా ఎంఐఎంతో పొత్తు ఉండనే ఉంది. ఇంకా కొత్తగా లెఫ్ట్ పార్లీల మద్ధతు కూడా ఉంటుందని మునుగోడు ఉపఎన్నికల సమయంలో స్పష్టమైంది.. కాబట్టి మెజార్టీ తక్కువ వచ్చినా వీటి సాయంతో ఈసారి కూడా ముచ్చటగా హ్యట్రిక్ విజయం అందుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈసారి అధికారం మారుతుందో లేదా హ్యాట్రిక్ కొడుతుందో.

కాంగ్రెస్‌ని ఈసారైన కనికరిస్తారా..?

తెంగాణ ఇస్తే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడతారని అప్పట్లో ఆ పార్టీ అధిష్ఠానం అనుకుంది. కానీ తీరా చూస్తే కేసీఆర్‌నే అఖండ మెజార్టీతో గెలిపించారు. సరే ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టిండు. సచ్చి బ్రతికిండు అని మొదటి సారి అవకాశం ఇచ్చారు. కానీ రెండోసారైనా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడతారు అనుకుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది. దీంతో ఈసారి దారుణంగా ఓటమిని మూటకట్టుకుంది. ఇంకా మూడోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆ పార్టీ అగ్రనాయకులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రలు..భారీ బహిరంగ సభలు, చేరికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌లో ఇప్పటికీ అది మిలియన్ డాలర్ల ప్రశ్నే

ఈ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల మధ్య సమన్వయం..ఐక్యత పూర్తిగా కొరవడింది. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి టీపీసీసీ పదవి ఇవ్వకుండా. నిన్నకాక మొన్న వచ్చిన రేవంత్ కు పార్టీ పగ్గాలు ఇవ్వడం కొంతమంది సీనియర్ నాయకులకు అది మింగుడుపడటం లేదు. దీంతో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ..పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు(దీనికి మునుగోడు ఉపఎన్నికే ఉదాహరణ). వీటితో పాటు అసలు ఆ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించి ఎన్నికల బరిలో దిగితే ఆ పార్టీకి కొంతైన కలిసి వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్ హామీలకు ప్రపంచ బ్యాంకు కూడా భయపడుతుందేమో..!!

రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు నోటికి ఏది వస్తే ఆ హామీలు ఇచ్చారు.తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రైతు రుణమాఫీ అంటా.. పింఛను 5 వేలు..గ్యాస్ రూ.500కే అంటా. నిరుద్యోగులకు రూ.4వేలు అంటా.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అంటా..రైతు బంధు రూ.15 వేలు ఇస్తారంటా. ఇలా ఆయన తలకుమించిన అసాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ అనవసరపు హామీలు ఇచ్చి అప్పులు తెలంగాణగా మార్చి..అభివృని గాలికి వదిలేశాడు. ఇంక ఈయన ఇచ్చే హామీలు తీర్చాలంటే ప్రపంచ బ్యాంకు కూడా అప్పు ఇవ్వడానికి బయపడుతుందేమో. అసలు ఇంకా మ్యానిపెస్టో విడుదల చేస్తే ఇంకా ఎలాంటి హామీలు ఇస్తారో. కాంగ్రెస్ అధికారం కోసం ఎలాంటి హామీలైనా ఇస్తుంది. ఎంతకైనా తెగిస్తుందని తెలుస్తోంది. మరి ఈసారి అయినా ఆ పార్టీకి అవకాశం ఇస్తారో లేదో కొంత కాలం వేచి చూడాలి.

బీజేపీ కార్యకర్తల్లో తగ్గిన జోష్..!!

మొదట్లో భారతీయ జనతా పార్టీని ఎవరు పెద్దగా లెక్కచేయలేదు. అసలు ఈ పార్టీకి తెలంగాణలో మనుగడ సాధ్యం కాదు అని అందరూ అనుకున్నారు. కానీ బండి సంజయ్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన నుంచి ఎప్పుడు ఎదో ఒక విమర్శలు చేస్తు జనం దృష్టిని ఆకర్షించారు. పార్టీని ఉవ్వెత్తున్న పుంజుకునేలా చేశాడు.. ఎన్నిక ఏదైనా గట్టి పోటీనే ఇస్తోంది. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడాా గెలవడం సాధ్యం కాదనుకన్న స్థితి నుంచి మూడు సీట్లు గెలిచే స్థాయికి తీసుకోచ్చారు బండి. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది అంటేనే అర్ధం అవుతుంది పార్టీ ఎంత బలంగా పుంజుకుందో. అదే హవా రాబోయో ఎన్నికల్లో చూపిస్తే మరిన్ని సీట్టు గెలిచే అవకాశం బలంగా కనిపిస్తోంది. కానీ సడన్‌గా బండిని పక్కన పెట్టి కిషన్ రెడ్డికి పగ్గాలు ఇచ్చే సరికి బీజేపీలో కార్యాకర్తల్లో కొంత జోష్ తగ్గిందనే చెప్పాలి.

బీజేపీ ఇప్పటికే ఎన్నికల కసరత్తు మొదలపెట్టింది. భారీ బహిరంగ సభలకు ప్రధాని మొదలుకొని కేంద్ర మంత్రుల వరకు అందరూ క్యూ కడుతూ అధికార పార్టీపై అక్కసు వెళ్లగక్కి వెళ్తున్నారు. ఇంకా హామీలు విషయానికి వస్తే తాము అధికారంలోకి వస్తే ధరణిని భూస్థాపితం చేస్తాం…రైతుబందు ఇవ్వం. నిరుద్యోగులకు పుష్కలంగా ఉపాధి కల్పిస్తాం..ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు కట్టిస్తాం..అని వీళ్లకు తోచిన హామీలు ఇస్తున్నారు. ఏ మాటకు ఆ మాట భాజాపా నాయకులు కాంగ్రెస్ నాయకుల్లాగా అసాధ్యం కాని హామీలు మాత్రం ప్రస్తుతానికి ఇవ్వలేదు. ఎన్నికలు ముందు వీళ్ల మ్యానిపెస్టో ఎలా ఉంటుందో ఎన్ని ఉచిత తాయిలాలు ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చాలా వరకు పుంజుకుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి బీజేపీ అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష హోదాను మాత్రం పొందుతుందని రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త పార్టీలు అలంకారప్రాయంగానే మిగులుతాయా..?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో కొత్త పార్టీలు రోజుకోకటి పుట్టుకోస్తూనే ఉన్నాయి. షర్మిల కొత్త పార్టీ వైఎస్సార్ తెలంగాణ .. ఆర్ ప్రవీణ్ బీఎస్పీ..కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి (దీనికి గత ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారు అది వేరే విషయం) ఇంకా కొన్ని చోటా మోటా పార్టీలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఈ మూడు పార్టీల నాయకులు పాదయాత్రల (పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అని) పేరుతో ప్రజల్లోకి బానే తిరిగారు. వీళ్ల ప్రసంగం విన్నారు. వాళ్లు వచ్చినప్పుడు జై కొట్టారు కూడా కానీ వీళ్లు ఎమ్మెల్యేగా నిలబడితే ఓట్లు వేసి గెలిపిస్తారనే నమ్మకం లేదు. సో ఈ కొత్త పార్టీలు హడావుడి ఆరంభ శూరత్వమే అని చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికలకు ఈ పార్టీల నుంచి బరిలోకిదిగే వారిని అసలు ప్రజలు పట్టించుకోరు. కాబట్టి కొత్త పార్టీలు ఈసారికి అలంకారప్రాయంగానే మిగులుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments