August 3, 2025 11:40 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Womens T20: మహిళల టీ 20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల

భారత్ సమాచార్.నెట్: మహిళల టీ20 (Womens T20) వరల్డ్ కప్-2026 (World Cup) షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ 2026 జూన్ 12న ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్-వేల్స్‌ వేదికగా ఈ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటనను విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో 12 జట్లు భాగం కానున్నాయి. భారత్. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో పాటు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో 4 జట్లు వరల్డ్ కప్‌నకు అర్హత సాధించనున్నాయి.

ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బీలో తలో 6 జట్లు ఉండనున్నాయి. ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జూన్ 12న మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీ జులై 5న లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరగనుంది. టీ20 ప్రపంచ కప్ 2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్,లార్డ్స్ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
గ్రూప్ 1లో భారత, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, 2 క్వాలిఫయర్ టీమ్స్ ఉండగా..  గ్రూప్ 2లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, 2 క్వాలిఫయర్ టీమ్స్ ఉండనున్నాయి. భారత్ తన టోర్నీ ప్రయాణాన్ని జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తలపడ్డ 15 మ్యాచ్‌లలో భారత్ 12 విజయాలు సాధించింది. పాకిస్తాన్ భారత్‌పై చివరిసారిగా 2022లో జరిగిన మహిళల ఆసియా కప్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ల అనంతరం సెమీ ఫైనల్స్ జూన్ 30, జూలై 2 తేదీల్లో ది ఓవల్ మైదానంలో జరగనున్నాయి. ఇక గ్రాండ్ ఫైనల్ జూలై 5న లార్డ్స్ వేదికగా జరగనుంది.
Share This Post