భారత్ సమాచార్.నెట్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror attack) తర్వాత భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పొరుగు దేశం పాక్‌ను దెబ్బకొట్టేందుకు భారత్ సింధూ నదీ జలాల (Sindhu River) ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవడం లేదని వరల్డ బ్యాంక్ చీఫ్ (World Bank Chief) అజయ్ బంగా (Ajay Banga) స్పష్టం చేశారు. భారత్, పాక్ సింధూ జలాల ఒప్పందంలో వరల్డ్ బ్యాంక్ ది సహాయక పాత్ర మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య దశాబద్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ బ్యాంకు పరిష్కరించనున్నట్లు మీడియాలో సాగుతున్న ఊహాగానాలకు అజయ్ బంగా స్పందించడంతో.. ఆ ప్రచారానికి తెరపడింది. ఈ మేరకు అజయ్ బంగా స్పందిస్తూ.. సింధూ నదీ జలాల డీల్ విషయంలో ప్రపంచ బ్యాంక్ జోక్యం చేసుకొని సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. కానీ అవన్నీ అవాస్తవాలని.. ప్రపంచ బ్యాంకుది కేవలం సహాయక పాత్ర మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఇకపోతే వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా భారత పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని కలిశారు. అలాగే పలు కార్యక్రమాలకు హాజరై అయ్యారు. ఈ క్రమంలో సింధూ నదీ జలాల ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంటుందని ప్రచారం జరగడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రపంచ బ్యాంక్ అధినేతగా పదవిని స్వీకరించిన తొలి భారతీయ అమెరికన్ సిక్కుగా రికార్డు క్రియేట్ చేసిన అజయ్ బంగా.. భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Share This Post