భారత్ సమాాచార్.నెట్: జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kasmir) అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం (pahalgam) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (Terror attack) యావత్తు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ దాడిలో దాదాపుగా 28 మంది చనిపోగా.. మరికొంత మంది గాయపడ్డారు. చిన్నారులు, మహిళలను వదిలిపెట్టి.. పురుషులనే లక్ష్యంగా చేసుకుని ముష్కర మూకలు కాల్పులు జరిపారు. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి ఇతర నేతలు సహా మరికొంత మంది ప్రముఖులు స్పందించారు. దాడిలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు ఉగ్రదాడిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లు ఖండించారు. ఈ దాడిపై విచారణ వ్యక్తం చేశారు. అలాగే, భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. కశ్మీర్ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత్ ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పహల్గామ్ దాడిని ఖండించారు. ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదని.. ఈ దాడి వెనుకున్నది ఎంతివారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆశిస్తున్నా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌తో మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని పుతిన్ పేర్కొన్నారు.