August 4, 2025 7:08 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Kangana Ranaut: ఆ ఛాంపియన్‌షిప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగనా

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ బాలీవుడ్ నటి (Bollywood Actress), ఎంపీ (MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ (World Para Athletics Championship)కు బ్రాండ్ అంబాసిడర్‌ (Brand Ambassador)గా ఎంపికయ్యారు. ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు ఢిల్లీ వేదికగా ఈ ఛాంపియన్‌షిప్ జరగనుంది. భారత్ నిర్వహిస్తోన్న అతిపెద్ద పారా ఈవెంట్ ఇది. వంద దేశాలకు పైగా పారా అథ్లెట్లు ఈ ఛాంపియన్‌షిప్‌ పాల్గొంటారు.
అంబాసిడర్‌గా నియమితులైన కంగనా రనౌత్ పారా క్రీడాకారుల విజయాలతో పాటు వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తారు.
అంబాసిడర్‌ హోదాలో మన ఛాంపియన్లకు మద్దతుగా నిలిచే అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని కంగన వ్యాఖ్యానించింది. భారత పారా అథ్లెట్లు ప్రతి రోజు చరిత్రను సృష్టిస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వడం, పారా క్రీడల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంలో భాగస్వామ్యం కావడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. పారా క్రీడలు అంటే కేవలం విజయాల కోసం పోటీ పడటం మాత్రమే కాదు, అది ధైర్యం, ధృఢ సంకల్పం, అసాధ్యాన్ని సాధించగల శక్తికి నిదర్శనం. ఇటువంటి ఛాంపియన్లకు నా మద్దతు ఉండటం నా జీవితంలో గర్వకారణం అని అన్నారు.
ఇకపోతే బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్.. చివరిగా పొలిటికల్ డ్రామ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు విడుదల ముందే ఆమె బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడంతో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా బీజీగా ఉన్నారు కంగనా.
Share This Post