Homeతెలంగాణయూట్యూబ్ ఛానెల్‌‌ను ప్రారంభించిన యశీల్‌గౌడ్

యూట్యూబ్ ఛానెల్‌‌ను ప్రారంభించిన యశీల్‌గౌడ్


భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి : యువత స్వయం ఉపాధి దిశగా ముందుకెళ్లాలని JYG ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ యువ నాయకుడు జడల యశీల్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసంలో నిర్వహించిన సమావేశంలో జర్నలిస్ట్ యంజాల ధనకుమార్ పటేల్‌కు చెందిన ‘A1లోకల్ యూట్యూబ్ ఛానెల్‌’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి దిశగా ముందడుగు వేస్తూ సమాజంపట్ల బాధ్యత గల వృత్తిలో రాణించడం గొప్పవిషయమని, భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని యశీల్ గౌడ్ సూచించారు.

ఒకవైపు వృత్తిపట్ల బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ, మరోవైపు సమాజంలో జరిగే వార్తలను, ఇతర సమాచారాన్ని నిక్కచ్చిగా ప్రజలకు తెలియజేసేందుకు యూట్యూబ్ ఛానెల్‌ను తీసుకురావడం శుభపరిణామని యశీల్ గౌడ్ ధనకుమార్‌ను అభినందించారు. ఈ సందర్భంగా యశీల్‌ గౌడ్‌ను ధనకుమార్ సన్మానించారు. అనంతరం ధనకుమార్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి యశీల్ గౌడ్ సన్మానించారు. కార్యక్రమంలో ఎ.సైదులు, ఎరసాని సాయికుమార్ యాదవ్, నితీష్, మధు, సయిద్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments