August 2, 2025 7:49 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

పెళ్లికి నిరాక‌రించిన ప్రియురాలు.. ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం

భార‌త్ స‌మాచార్.నెట్, కృష్ణా: ప్రియురాలు పెళ్లికి నిరాక‌రించ‌డంతో ఓ యువ‌కుడు ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌ గుడివాడ మండలం తటివర్రు గ్రామంలో చోటుచేసుకుంది. వివ‌రాలిలా.. గ్రామానికి చెందిన కొల్లూరి సంపత్‌కుమార్ (21)కు ఫేస్‌బుక్ ద్వారా ఓ యువ‌తి ప‌రిచ‌య‌మైంది. నిత్యం ఆ యువతితో చాటింగ్ చేసేవాడు. ఇటీవల ఆ యువతి సంపత్‌తో సరిగా మాట్లాడటం మానేసింది. పెళ్లి చేసుకుందామని సంపత్ అడగగా, ఆమె నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్ కుమార్ గురువారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న అతని స్నేహితుడు యువరాజు వెంటనే సంపత్‌ను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

CM Chandrababu Naidu: శ్రీశైలం జలాశయం నిండటం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Share This Post