భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: మానూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన ఓ యువకుడు ఉసిరికేపల్లి దుర్గమ్మ వాగు సమీపంలోని పొలాల్లో అనుమానాస్పదంగా మృతిచెందాడు. మృతుడిని వట్‌పల్లి మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన బోయిని తేజ (23)గా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన తేజ కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పొలాల్లో తేజ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అదే గౌతాపూర్ గ్రామానికి చెందిన సికిందర్‌పై మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తేజ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
మరిన్ని కథనాలు