భారత్ సమాచార్.నెట్, నేషనల్: యూట్యూబ్‌లో (Youtube ) అవసరమైన కంటెంట్ కంటే కూడా అనవసరమైన కంటెంటే ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ఫేక్ కంటెంట్, విద్వేషపూరిత వీడియోలు, వేధింపులు, హింస వంటి వాటికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు యూజర్స్. తెలిసింది కొంచమైతే దానికి లేని పోనిది యాడ్ చేసి ఎవరికీ నచ్చింది వాళ్లు యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు, ఇదే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే వీటిపై యూట్యూబ్‌కు భారీగా ఫిర్యాదులు రావడంతో.. తాజాగా వీటిపై యూట్యూబ్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ (Strict Rules)ను అమలు చేస్తూ.. అనవసరమైన కంటెంట్‌ను యూట్యూబ్ తొలగిస్తోంది.
కేవలం మూడు నెలల వ్యవధిలోనే 95 లక్షల వీడియోలు.. 45 లక్షల యూట్యూబ్ ఛానెళ్ల (Channels)ను యూట్యూబ్ తొలగించింది. ముఖ్యంగా ఇందులో ఎక్కువ భాగం భారతీయులు చేసిన వీడియోలే ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోల్లో ద్వేషపూరిత ప్రసంగం, పుకార్లు, వేధింపులు వంటివి ఉన్నాయని.. ఇవి కంటెంట్ విధానాలకు విరుద్ధమని యూట్యూబ్ పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ వీడియోలు గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినవి. కాగా ఈ కంటెంట్‌ను తొలగించేందుకు యూట్యూబ్ ఏఐ (Artificial intelligence)ను ఉపయోగిస్తుంది. యూట్యూబ్ తొలగించిన వీడియోల్లో చాలా వరకు పిల్లలను చూపించగా.. కొన్ని వీడియోల్లో ప్రమాదకరమైన విన్యాసాలు, పిల్లలను వేధించడం వంటివి కూడా ఉన్నట్లు కంపెని నివేదికలో పేర్కొంది.
48 లక్షల ఛానెళ్ల తొలగింపు:
కేవలం వీడియోలతోనే ఆపకుండా.. 45లక్షల ఛానెళ్లను కూడా యూట్యూబ్ తొలగించింది. అంతటితో ఆగకుండా వీడియోల కింద ఉన్న మొత్తం 1కోటి2లక్షల కామెంట్లను కూడా డిలీట్ చేసింది. ఈ ఛానెల్‌ల ద్వారా స్పామ్ లేదా మోసపూరిత వీడియోలు అప్‌లోడ్ చేయబడుతున్నాయని వెల్లడించింది. కాగా యూట్యూబ్‌లో ఒక ఛానెల్ తీసివేస్తే, ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన అన్ని వీడియోలు కూడా తొలగిపోతాయి. ఆ ఛానెల్‌పై తీసుకున్న చర్య కారణంగా, దాదాపు 5.4 మిలియన్లు అంటే 54 లక్షల వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసింది. ఇకపోతే యూట్యూబర్లు ఎవరైనా తమ ఛానెళ్లను కోల్పోకుండా ఉండాలంటే యూట్యూబ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి, వీడియోలు అప్లోడ్ చేసే ముందు అన్ని చెక్ చేసుకుని యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం మేలు.