Homemain slidesఏపీలో మరో పాదయాత్ర...

ఏపీలో మరో పాదయాత్ర…

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలకు చాలా ప్రాముఖ్యం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలుకుని చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్రలు చేసే సీఎంలు అయ్యారు. ఇప్పడు అదే తరహాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజ శేఖర్ రెడ్డి కూతురు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పాదయాత్రకి సిద్ధమవుతున్నట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవ‌రూ ఊహించ‌రు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే కచ్చితంగా తన ముద్రపడాలంటే ప్రజల్లో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆమెకు ఏపీలోనూ, తెలంగాణ లోనూ పాదయాత్ర చేసిన అనుభవం కూడా ఉంది.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 2004 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించారు. అలాగే భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కూడా రెండేళ్ల ముందే యాత్ర ప్రారంభించి రెండు విడతలుగా పూర్తి చేశారు. ఇప్పుడు ఏపీలో 2.8% మాత్రమే ఉన్న ఓటు బ్యాంకును పుంజుకునేలా చేయడంతో పాటు నాయకులను బలోపేతం చేయాల్సిన అవసరం షర్మిలకు ఏర్పడింది. ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాను పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వైసిపి నుంచి బలమైన నాయకులు బయటకు రావాలన్నా, తన పార్టీలో చేరాలన్నా ముందు ప్రజల్లో తన విశ్వస‌నీయ‌త‌ను పెంచుకోవడంతోపాటు ప్రజల్లో బలోపేతం కావాలని వ్యూహాన్ని ఆమె రచించిన‌ట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి షర్మిల సమాచారం అందించినట్లు రఘువీరారెడ్డి వంటి నాయకులు చెబుతున్నారు. అంటే ఇది అధికారికంగా బయటికి రాకపోయినా అంతర్గ‌త‌ చర్చల్లో మాత్రం షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయాన్ని చాలామంది నాయకులు ఒప్పుకుంటున్నారు.

మొత్తంగా మూడు విడతల్లో చేయాలనే ఉద్దేశంతో షర్మిలో ఉన్నారని సమాచారం. ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల్లో మూడు విడతలుగా పాదయాత్ర చేసి సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో ఉండటం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైయస్ వారసత్వాన్ని కూడా తాను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తున్నారనేది మీరు మాట. దీనికి పార్టీ అధిష్టానం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వస్తే కనుక షర్మిల వచ్చే ఏడాది ప్రారంభం నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇది అధికారికంగా కాదు. కానీ అంతర్గత చర్చల్లో మాత్రం జోరుగానే ప్రచారం జరుగుతోంది. మ‌రి వైఎస్ షర్మిల ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

కూటమిలో ‘నామినేటెడ్’ ఈక్వేషన్స్

RELATED ARTICLES

Most Popular

Recent Comments