భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ భాషా మరియు సంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేయబడిన ఉచిత వేసవి యోగా వర్క్‌షాప్ పోస్టర్‌ను రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా మరియు సంస్కృతి శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్ అయిన భవాని నీరటి ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో మే 12వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 21 రోజులపాటు ప్రతీ రోజు ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు రవీంద్ర భారతి ప్రాంగణంలో ఈ వర్క్‌షాప్ జరుగుతుంది. యోగా అనేది భారతీయ సంప్రదాయంలోని అమూల్యమైన ఆస్తి అని పేర్కొన్న మామిడి హరికృష్ణ ప్రతి ఒక్కరూ దీనిని అలవాటు చేసుకుని మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు అక్షర కుమార్, అనిల్ నక్క, అచ్యుత్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డీ అందె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత యోగా వర్క్‌షాప్‌లో పాల్గొనదలచినవారు +91 9493654626 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా info.yogabhyas@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
