July 28, 2025 11:41 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది…

భారత్ సమాచార్ ; చెప్పిన సమయానికి ఉస్తాద్ భగత్ సింగ్ గింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. ఎన్నికల సమయం కాబట్టి అంతా ఊహించినట్టే పవన్ అభిమానులతో పాటుగా, జనసైనికులను కూడా మెప్పించేలా ప్రచార చిత్రాన్ని రూపొందించారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది…గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం, కనిపించని సైన్యం అనే సంభాషణలు అలరిస్తున్నాయి. పవన్ పవర్ పుల్ పోలీసు పాత్రతో కనిపిస్తున్నాడు. శ్రీలీలా కథానాయిక. పవర్ స్టార్ కి ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ను అందించిన హారిష్ శంకర్ దర్శకుడు. ఇందులో ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. డీఎస్పీ మ్యూజిక్ బాగా హైప్ క్రియేట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం. గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ రికార్డ్స్ ను భగత్ సింగ్ బ్రేక్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Share This Post
error: Content is protected !!