భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: టీ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు చల్లారక ముందే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శుక్రవారం జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి పార్టీలోనూ ఒకరు, ఇద్దరు కోవర్టులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీ కోవర్టులు ఉన్నారన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మంటలు పుట్టిస్తున్నాయి.…