భార‌త్ స‌మాచార్, ఉద్యోగం : అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చినట్లు ప్రకటించింది. అగ్నిపథ్ నియామక విధానంలో మార్పులు చేస్తూ నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసులోకి ఎంపిక కాని వారికి మరో రెండేళ్లు సాయుధ దళాల్లో పనిచేసే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. దీంతో వారి మొత్తం సర్వీసు కాలం ఆరేళ్లకు పెరగనుంది. నవంబర్ 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం కోల్పోతామనే…