భార‌త్ స‌మాచార్, ఆరోగ్యం : గుండెపోటు అనగానే చాలామందికి ఛాతీలో తీవ్రమైన నొప్పి గుర్తుకొస్తుంది. అయితే గుండెపోటు లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు గొంతు, మెడ, దవడ, భుజాలు, చేతుల్లోనూ నొప్పి కనిపించవచ్చు. ముఖ్యంగా ఎలాంటి దంత సమస్యలు లేకుండానే అకస్మాత్తుగా దవడ నొప్పి రావడం, గొంతులో బిగుతుగా అనిపించడం వంటివి గుండె సంబంధిత సమస్యలకు సంకేతాలు కావచ్చు. గుండె నుంచి ప్రారంభమైన నొప్పి ఇతర శరీర భాగాలకు వ్యాపించడాన్ని వైద్య పరిభాషలో రిఫర్డ్…