భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం పాత తండాలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధిక్కార స్వరం, ఉద్యమ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచి ఇస్లావత్ నరేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ జీవితాన్ని, ఆయన ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచి ఇస్లావత్ నరేష్ మాట్లాడుతూ.. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం…





