భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆర్కే టవర్స్ అపార్ట్‌మెంట్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ వాసులు, నిర్వాహకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నని వెంకన్న, బానోత్ రవికుమార్, ఎడ్ల వేణు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






