భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు అందిస్తున్న అల్పాహారాన్ని చిన్నారులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బానోతు రేణుక నరేష్ నాయక్ సూచించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు అందించే పోషకాహారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందేలా చూడాలని తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని పెద్ద తండా అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం సర్పంచ్ రేణుక నరేష్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వివిధ వర్గాలకు…