భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా పట్టణంలో మంగళవారం జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని పోలీసులు సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగిందని, హిందూ,…