భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం పంతులు తండాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విఘ్నేశ్వరుని ఆలయం వద్ద సోమవారం రాత్రి మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో తండావాసులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నప్రాసన వేడుక సందర్భంగా అన్నదానం
తండాకు చెందిన భూక్య భద్రు నాయక్, అమాలి దంపతుల కుమారుడు, కోడలు శ్రీహరి నాయక్, అంజలి దంపతుల కుమారుని అన్నప్రాసన వేడుకను పురస్కరించుకొని గణపతి మండపం వద్ద భద్రు…






