భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫౌండేషన్ (జీఈసీఎఫ్) సమన్వయంతో ‘విదేశీ ఉన్నత విద్యా సదస్సు–పాస్‌పోర్ట్ మేళా’ నిర్వహించారు. బీవీఆర్‌ఐటీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, స్వీడన్ తదితర దేశాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయ ప్రతినిధులతో నేరుగా సంభాషణ
ఈ సదస్సులో విద్యార్థులు…






