భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు అల్పాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

కిచెన్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

మంగళవారం మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్‌ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కిచెన్‌లో ఏర్పాటు చేసిన సామాగ్రి, వివిధ యంత్రాలను ఆమె పరిశీలించారు. యంత్రాల…