భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుర్తించి రికవరీ చేయడంలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు.
తాజాగా 77 మొబైల్ ఫోన్ల రికవరీ
జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి.,…






