భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే రక్తహీనతను నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఐసిడిఎస్ వలిగొండ సెక్టార్ సూపర్‌వైజర్ పారిజాత, వలిగొండ అంగన్‌వాడీ టీచర్ బాలవిజయ అన్నారు. పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా వలిగొండ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ-2 కేంద్రంలో మంగళవారం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పోషకాహారంపై ప్రత్యేక అవగాహన

ఈ సందర్భంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్లతో ప్రత్యేక ఆహార ప్రదర్శనను ఏర్పాటు…