భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు వివిధ గ్రామాల్లో గణపతి నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు, పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు. స్థానిక తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో పార్థసారథి, ఎస్సై పి.నరేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

భక్తులకు సూచనలు.. ప్రశాంతంగా నిమజ్జనం

గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు భక్తులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు…