భారత్ సమాచార్, అమరావతి: మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కూటమి నేతలు ప్రకటించడంపై సీపీఐ నేత కె. నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన తప్పులను అంగీకరించి, ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పడం సరికాదని విమర్శించారు.

నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం వంటి పరిణామాల కారణంగానే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని నారాయణ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పదవులు…