భారత్ సమాచార్, మెదక్ : రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గాజవాడ లావణ్య అధికారులకు సూచించారు. ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

రామాయంపేట…