భార‌త్ స‌మాచార్, టెక్నాలజీ : స్మార్ట్‌ఫోన్‌ తయారీలో ఉపయోగించే మెమొరీ చిప్‌ల ధరలు పెరగడం, పరికరాల తయారీ వ్యయాలు అధికం కావడం అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో కంపెనీలు ఫోన్ల ధరలను పెంచుతుండగా, వినియోగదారులు కొత్త ఫోన్‌ కొనుగోలును వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా రూ.20 వేలలోపు ధర కలిగిన ఫోన్ల షిప్‌మెంట్లు ఏకంగా 47% తగ్గడం గమనార్హం. పండగల సీజన్‌లోనూ డిమాండ్‌ బలహీనంగా ఉండటంతో తయారీ సంస్థలు, విక్రయదారులు మార్కెట్‌కు పంపే నిల్వలను తగ్గించినట్లు కౌంటర్‌పాయింట్‌ తెలిపింది.

ఈ పరిస్థితుల్లో శామ్‌సంగ్‌ 17% మార్కెట్‌…