భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు పంపించినట్లు ఎస్సై గంగారపు కరుణాకర్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన నన్నబోయిన (జక్కుల పుల్లయ్య) న్యాయస్థానం నిర్ణయించిన వాయిదాలకు హాజరుకాకపోవడంతో సంబంధిత తొర్రూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు ఎస్సై కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అతడి కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా…






