భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్లు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను భైంసా రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 170 తులాల వెండి, 13 గ్రాముల బంగారం, ₹.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు భైంసా ఏఎస్పీ సాయికిరణ్ వెల్లడించారు.
జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండటంతో అప్రమత్తమైన భైంసా రూరల్ పోలీసులు కేసులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి, ఆగస్టులో ఐదుగురు…





