భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాలకు వెళ్లాలని ఆంజనేయులు గౌడ్…






