భార‌త్ స‌మాచార్, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. నవంబర్ 6న సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన షమీ.. దాదాపు 13 ఏళ్ల టెస్టు ప్రయాణానికి ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ అతడిపై ప్రశంసలు కురిపించారు. షమీతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, అతడు జట్టుకు అందించిన సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. టెస్టులకు షమీ వీడ్కోలు పలకడం…