భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పిల్లలపై జరిగే నేరాలను అరికట్టి, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి, పెద్దతండ గ్రామాల్లో శనివారం ICDS సూపర్వైజర్ జలగం సునీత ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (VCPC) ఏర్పాటు చేశారు.

మేచరాజుపల్లి గ్రామ కమిటీకి స్థానిక సర్పంచ్ తూర్పాటి శంకర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పెద్దతండ కమిటీ కన్వీనర్‌గా బాదావత్ సుధారాణి సురేష్‌ను ఎంపిక చేశారు. రెండు గ్రామాల్లోనూ మరో 15 మంది…