భార‌త్ స‌మాచార్, వెబ్ డెస్క్ : భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. ఇళ్ల ముందు వెలిగే మట్టి ప్రమిదలు, రంగురంగుల ముగ్గులు, బాణసంచా వెలుగులు, కొత్త బట్టలు, మిఠాయిలు.. ఇలా దేశమంతా పండుగ శోభతో కళకళలాడుతుంది. అయితే దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం మాత్రమే కాదు. దీని వెనుక ఎన్నో ఆసక్తికరమైన పురాణగాథలు, చారిత్రక విశేషాలు దాగి ఉన్నాయి. సంస్కృతంలోని 'దీపావళి' అనే పదానికి దీపాల వరుస అని అర్థం. చీకటిపై…