భార‌త్ స‌మాచార్, వెబ్ డెస్క్ : విద్యుత్ బిల్లులతో ఇబ్బందులు పడుతున్న సామాన్య కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన ఉపయోగకరంగా మారుతోంది. ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు 2024 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలనేది లక్ష్యం. ఇందుకోసం కేంద్రం మొత్తం రూ.75,021 కోట్ల నిధులను కేటాయించింది. సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు కుటుంబాల నెలవారీ విద్యుత్ ఖర్చులను…