భార‌త్ స‌మాచార్, భ‌క్తి : దేవాలయానికి వెళ్లినప్పుడు భక్తులు తమ ఇష్టదైవానికి పూజలు చేసి నమస్కరిస్తుంటారు. కొందరు చేతులు జోడించి నమస్కరిస్తే.. మరికొందరు శరీరంలోని ఎనిమిది అంగాలు నేలను తాకేలా సాష్టాంగ నమస్కారం చేస్తారు. అయితే ఆలయంలో ఎక్కడపడితే అక్కడ సాష్టాంగ నమస్కారం చేయకూడదని ఆధ్యాత్మిక సంప్రదాయాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ధ్వజస్తంభం దగ్గర నిర్దేశించిన ప్రదేశంలోనే ఈ నమస్కారం చేయాలని పెద్దలు చెబుతుంటారు. ఈ ఆచారం వెనుక ఆధ్యాత్మిక భావనతో పాటు ఆలయ నిర్మాణానికి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి.

సాధారణంగా ఆలయంలో ప్రధాన…