భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టి ప్రమాదానికి కారణమైన అనంతరం తప్పించుకుని తిరుగుతున్న కారును పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రమాదానికి కారణమైన కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 24న నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన తూల్ల శ్రీధర్, గడ్డమీది వెంకన్న, ఆయన కుమార్తె…