భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగగా ఉంది. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగను ప్రజలు ఆనందంగా, సుఖసంతోషాలతో, చిరునవ్వులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తూ ముందుకు సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని కూడా మంత్రి ఉద్దేశించారు.