భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్ అధికారి వోరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. కేంద్ర సేవల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను రాజస్థాన్ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రప్పించి సీఎస్ పదవిని అప్పగించింది. ఈ నియామకం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.

 

వోరుగంటి శ్రీనివాస్ 1966లో ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో జన్మించారు. తన విద్యాభ్యాసం భద్రాచలం మరియు ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. 1989లో ఎం.టెక్ పూర్తి చేసిన అనంతరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో ఎంపికయ్యారు. తన పరిపాలనా నైపుణ్యం,…